15-02-2025 06:23:32 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో రెండు నివాస గుడిసెలు ప్రమాద శాతం దగ్ధం అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంగయ్యడ రాజశేఖర్, సంగయ్యడ భాస్కర్ వీరిద్దరి నివాస గుడిసెలు దగ్గునమైనయని సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వారు అంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైనా ప్రమాదవశాతం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(Yellareddy MLA Madan Mohan Rao) స్పందించి వారికి నివాస గృహాలు కల్పించాలని వారికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నివాస గుడిసెలు పూర్తిగా కాలిపోవడం జరిగిందని తెలిపారు. వంటసామాగ్రి బట్టలు వివిధ వస్తువులు పూర్తిగా కాలి బూడిద అయినట్లు తెలిపారు.