15-04-2025 08:00:52 PM
బోథ్ (విజయక్రాంతి): గంజాయి కేసులో పట్టుబడిన పాత నేరస్తులను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ లో మర్లపెళ్ళి లోని సిరిసే వంశీకి 5 కిలోల గంజాయి సరఫరా చేసిన కేసులోని నిందితులైన బుర్కులే నాందేవ్, గోధుమలే మారుతి అను నిందితులు బోథ్ బస్టాండ్ లో సంచరిస్తున్న క్రమంలో విశ్వసనీయ సమాచార మేరకు పట్టుకున్నామని తెలిపారు. గంజాయి అమ్మిన, నిల్వ ఉంచిన, సాగు చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.