13-03-2025 12:05:05 AM
నల్లగొండ, మార్చి 12 (విజయక్రాంతి) : విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి డబ్బు దండుకున్న ఇద్దరిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు. 4.5 తులాల బంగారం, పది ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. బుధ వారం మిర్యాలగూడలోని తన కార్యాలయంలో డీఎస్సీ రాజశేఖర్ రాజు మీడి యాకు వివరాలు వెల్లడించారు.
అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైరైన ఓ ఉద్యోగి తిరుమలగిరి (సాగర్) మండలానికి చెందిన ఆంగోతు గణేశ్‌ను తన వద్ద పనిలో పెట్టుకున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ గణేశ్ యజమానికి ఓ మహిళను ఎరగా చూపాడు. ఆమెతో అసభ్యకర రీతిలో ఫోటో లు, వీడియోలు తీసి బెదిరించాడు. బాకీ ఉన్నట్లు 19 ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు.
నాలుగేండ్లుగా బాధితుడి నుంచి రూ. 46 లక్షల వసూలు చేశాడు. గణేష్ బావమరిది శంకర్ సైతం కొంతకాలంగా ఇదే రీతిలో డబ్బుల కోసం విశ్రాంత ఉద్యోగిని వేధించాడు. దీంతో విసిగిపోయిన అతడు పోలీసులను ఆశ్రయిం చాడు. కేసు నమోదు చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.