calender_icon.png 24 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహ నిర్మాణానికి 2.19 లక్షల కోట్లు

24-07-2024 12:50:59 AM

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో గృహనిర్మాణానికి రూ. 2,19,643 కోట్లను కేటాయించారు. వచ్చే ఐదు సంవత్సరాలలో అర్బన్ హౌసింగ్ కోసం వీటిని ఖర్చు చేస్తామన్నారు. అందులో రూ. 1,43,247 కోట్లను సెంట్రల్ ఫోర్సెస్ అయిన సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ వంటి శాఖలకు కేటాయించారు. ఇకపోతే బడ్జెట్‌లో రూ. 42,277 కోట్లను కేంద్రపాలిత ప్రాంతం అయిన జమ్ముకాశ్మీర్‌కు కేటాయించారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అలాగే రూ. 5,985 కోట్లను మరో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు, రూ. 5,862 కోట్లను చంఢీగర్‌కు, రూ. 5,958 కోట్లను లడఖ్‌కు కేటాయించారు. కేంద్ర క్యాబినెట్ ఖర్చుల కోసం రూ. 1,248 కోట్లను కేటాయించిన నిర్మలమ్మ, విపత్తు నిర్వహణ, పునరావసం కోసం రాష్ట్రాలకు రూ. 6,458 కోట్లు మంజూరు చేశారు.