02-03-2025 12:18:17 PM
పెద్దకాపర్తి,(విజయక్రాంతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద కపర్తి సమీపంలో ఆదివారం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్, రెండు కార్లు ఈ ప్రమాదంలో ఢీకొన్నాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడంతో వాహనం రోడ్డుపై అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో బస్సును వెంబడించిన కారు, ఆ కారు వెనుకల మరో కారు వెనుక నుండి వస్తున్న కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో లోపల ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతించేందారు. ఈ ప్రమాదంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. బస్సు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల గుర్తింపు ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రమాదంలో చిక్కుకున్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.