నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో బస్టాండ్ వద్ద గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి తెలిపారు. తబ్రిన్ షేక్ అహ్మద్ ఇద్దరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా గంజాయితో పట్టుబడ్డట్లు వివరించారు వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు