calender_icon.png 8 January, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంబారులో బొద్దింకలు.. పక్కకు పడేసి తిను..!

07-01-2025 06:43:05 PM

హోటల్ యజమాని అహంకారపూరిత సమాధానం...

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఓ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురయింది. మధ్యాహ్నం కొల్లాపూర్ పట్టణానికి చెందిన శివ తన స్నేహితుడితో కలిసి జిల్లా కేంద్రంలోని శ్రీలేఖ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. పప్పు, భోజనం, ఆమ్లెట్ కొనుగోలు చేసి అక్కడే భోజనం చేస్తున్న క్రమంలో సాంబార్లో బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ కస్టమర్లు హోటల్ యజమానిని పిలిచి ఇదేంటని ప్రశ్నించగా బొద్దింకే కదా తీసి పడేసి తినేసేయండి అంత కంగారెందుకు అంటూ చాలా లైట్ గా తీసుకొని ఓవరాక్షన్ చెయ్యొద్దు తింటే తినండి లేదా గెట్ అవుట్ అంటూ హెచ్చరించడంతో చేసేదేంలేక హోటల్ నుండి బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు ఆ హోటల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ ను వివరణ కోరగా నాగర్ కర్నూల్ జిల్లాలోని హోటల్ యజమానులు నాణ్యత పాటించకపోతే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు.