వెల్దుర్తి, సెప్టెంబర్ 10: గుర్తు తెలియని వ్యక్తిని దొంగగా భావించి చితకబాదడంతో మృతిచెందిన కేసు లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శివ్వంపేట మండ లం గోమారంలో గుర్తు తెలియని వ్యక్తి గత నెల రోజులుగా భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నాడు. గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయని, ఇందుకు ఈ వ్యక్తే కారణ మని భావించి ఈ నెల 4న గ్రామానికి చెందిన మణికంఠ, తిరుపతిరెడ్డి అతన్ని చితకబాది అక్కడే వదిలేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం అతను చనిపోయి ఉండడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమో దు చేశారు. కాగా, సోమవారం సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం బయటపడింది. ఇందుకు బాధ్యులైన మణికంఠ, తిరుపతిరెడ్డిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.