calender_icon.png 8 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ కాల్వలో ఇద్దరి గల్లంతు!

06-01-2025 12:00:00 AM

ఖమ్మం, జనవరి 5 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండ   పడమట లోకారం గ్రామం సమీపంలోని సాగర్ కాల్వలో సెల్ఫీలు దిగేందుకు దిగిన ఇద్దరు యువకులు కాల్వలో గల్లంతు అయినట్లు సమాచారం. సెల్ఫీలు దిగే క్రమంలో ఓ యువకుడు కాలు జారి కాల్వలో పడి కొట్టుకుపోతుండగా, అతన్ని కాపాడేందుకు మరో యువకుడు కాల్వలోకి దిగి నీటి ఉధృతిలో కొట్టుకుపోయినట్లు తెలిసింది. ఇద్దరిది పడమట లోకారం గ్రామమని స్థానికులు తెలిపారు.