29-03-2025 12:00:00 AM
కోహీర్,మార్చి 28:అనుమానాస్పద స్థితి లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పైడిగుమ్మల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్త్స్ర సతీష్ వర్మ సమాచారం ప్రకారం మృతులు వైద్యనాథ్ భట్ (25), హరిసింగ్(30) తమ కుటుంబాలతో కలిసి పైడిగుమ్మల్ గ్రామ శివారులో ఫామ్ ల్యాండ్ లో గత కొంత కాలంగా పనిచేస్తు అక్కడే నివాసముంటున్నారు.
ఈ నెల 10 తేదిన బయటికి వెళ్ళిన హరి సింగ్, వైద్యానాథ్ ఎంతకు తిరిగి రాకపోవడంతో సూపర్ వైజర్ 13 తేదిన పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఫామ్ ల్యాండుకు అరకిలోమీటరు దూరంలో మనియార్ పల్లి శేఖర్, ఈశ్వర్ పొలంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో దుర్వాసన రావడంతో అనుమానాస్పద స్థితిలో వెళ్లి చూడగా తప్పిపోయిన వ్యక్తులు శవమై కనిపించారు. శుక్రవారం మధ్యాహ్నం క్రేన్ సహాయంతో శవాలను వెలికి తీశారు.
సంఘటన స్థలంలో పోస్టు మార్టం నిర్వహించి పైడిగుమ్మల్ వైకుంఠ ధామంలో సంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడు హరి సింగ్ వివాహం జరిగింది. భార్య ఒక కొడుకు ఉన్నాడు. వైద్యనాథ్ భట్ కు ఇంకను వివాహం కాలేదు. మద్యం మత్తులో చీకట్లో దారి తెలియక బావిలో పడి మరణించి ఉంటారని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్త్స్ర సతీష్ వర్మ తెలిపారు.