calender_icon.png 24 December, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుతో ఇద్దరి మృతి

07-10-2024 12:00:00 AM

  1. ఐనవోలు మండలం వెంకటాపూర్‌లోవిషాదం
  2. మూడురోజుల క్రితమే ముగ్గురు బలి

హనుమకొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో విషాదం నెలకొ ంది. మూడు రోజుల క్రితమే పిడుగుపడి ముగ్గురు మృతిచెందగా.. ఆదివారం సాయంత్రం పిడుగు పడి మరో ఇద్దరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన దౌత్ బాజీ శ్రావణి(17), రైతు కూక ట్ల రాజు(25) వారి వ్యవసాయ క్షే త్రం వద్ద పనులు చేస్తున్నారు.

సా యంత్రం ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షం కురుస్తున్న క్రమ ంలో పక్కనే ఉన్న రేకుల షెడ్డు కిం దకు వెళ్లారు. అప్పటికే ఆ షెడ్డు కిం ద పది మందికి పైగా ఉన్నారు. ప్రమాదవశాత్తు వారి సమీపంలో పిడుగు పడగా, ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారు ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. కాగా, సెలవులు కావడంతో శ్రావణి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.