హుజూర్‌నగర్, డిసెంబర్ 6: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా మ ఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం వెళ్లే దారిలో శుక్రవారం చోటు చేసుకుంది. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే దేశినేని రామారా వు(45) మఠంపల్లిలో ఎల్‌సీ తీసుకోకుండా విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైర్లను సరిచేస్తున్నాడు. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
సాతేల్లి గ్రామంలో..
కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతేల్లి గ్రామానికి చెం దిన ఎరుకల లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మహిళ మృతిచెందినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.