calender_icon.png 23 February, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిప్పు అంటించుకుని ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

23-02-2025 08:10:07 PM

కొండపాక: ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాదు నుంచి ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు మహిళ మరొకరు పురుషుడు కలిసి తిమ్మారెడ్డిపల్లి శివారులోని హోటల్ వద్ద  శనివారం రాత్రి దిగారు. రోడ్డుకు కొంత దూరంలో చెట్ల పొదల మధ్యన వారి వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నారు. అక్కడ ఒక్కసారిగా మంటలు రావడంతో పరిసర ప్రాంతంలోని స్థానికులు గమనించి వెంటనే నీటితో ఆర్పే ప్రయత్నం చేశారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారిలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పురుషుడు సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. తదుపరి మృతుల వివరాలు తెలుసుకునగా వారి బ్యాగులలో గల ఆధార్ కార్డుల వివరాలు ప్రకారం సిద్దిపేట సాయి విద్యానగర్ కాలనీకి చెందిన శిరోద్కర్ లక్ష్మి (65) భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా మేడిపల్లి ఘట్ కేసర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఆదర్శనగర్ చెందిన టెక్లేకర్ శ్రీధర్ (44) తండ్రి నర్సోజి అని సమాచారం ఉంది. ఇట్టి వ్యక్తులను గుర్తుపట్టిన వారు 8712667342, 8712667345 ఈ నెంబర్ లకు సమాచారం ఇవ్వాలని కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.