మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పరిధిలోని ఘనపూర్ సర్వీస్ రోడ్డులో ఓ కారు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఇద్దరు సజీవదహనమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఘట్ కేసర్ పరిధిలోని ఘనపూర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో వెళ్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మాటలు ఆర్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.