calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

15-04-2025 07:05:48 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల్ల బయ్యారం గ్రామపంచాయతీ ఉప్పాక బ్రిడ్జి వద్ద మంగళవారం గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎస్సై రాజ్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పాసింజర్ ఆటోలో తోగూడెం గ్రామం వెళ్తున్నామని ఎక్కి 1కేజీ 300 గ్రాములు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇరువురు తోగ్గుడెం గ్రామానికి చెందిన లోకేష్, ఆదిత్యగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వారి వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.