calender_icon.png 17 January, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు కోరికల్లో రెండు తీరాయి

17-01-2025 12:32:44 AM

అందం, అభినయంతో పాటు దానికి తగ్గట్టుగా కాస్త అదృష్టం ఉండాలే కానీ ఇండస్ట్రీలో హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా దూసుకెళుతారు. ప్రస్తుతం హీరోయిన్ మీనాక్షి చౌదరి చేస్తున్నది అదే. ఆమె తొలి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా సరే.. ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. 2024 తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని నెలలకే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది.

ఇక ఈ ఏడాది తొలి మాసంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో పెద్ద సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 టైటిల్‌ను గెలుచుకుంది.

అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి తన లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. హార్డ్ వర్క్, డిసిప్లెన్ రెండూ తన సక్సెస్ సీక్రెట్స్ అని పేర్కొంది. “నాకు చిన్నప్పటి నుంచి మూడు కోరికలుండేవి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడు సివిల్ సర్వెంట్. మొదటి రెండూ సాధించానని మీనాక్షి చెప్పుకొచ్చింది.