calender_icon.png 28 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు

28-11-2024 12:00:00 AM

యాక్టివా ఈ, క్యూసీ 1 మోడల్స్ ఆవిష్కరణ

బెంగళూరు, నవంబర్ 27: జపాన్ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ కంపెనీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను బుధవారం ఆవిష్కరిం చింది. యాక్టివా ఈ, క్యూసీ 1 మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీటికి బుకింగ్స్,  ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే ఈ స్కూట ర్ల ధరల్ని వెల్లడించలేదు. యాక్టివా ఈ, క్యూ సీ 1లను విడుదల చేయడం  ఎలక్ట్రిఫికేషన్‌లో హోండా ప్రయాణంలో ఒక మైలు రాయిగా హోండా మోటార్‌సైకిల్, స్కూటర్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో త్సుషుము ఒటాని అభివర్ణించారు. యాక్టివా ఈ స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో, క్యూసీ1 ఫిక్స్‌డ్ బ్యాటరీ సెటప్‌తోనూ ఉంటాయి.