calender_icon.png 28 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెటీరియల్ సైన్స్‌లో రెండు కొత్త చాప్టర్లు

28-11-2024 03:31:23 AM

  • ఐఐటీ హైదరాబాద్‌లో ప్రారంభం
  • అమెరికన్ సొసైటీ ఫర్ మెటల్స్‌తో కలిసి ఆవిష్కరణ

హైదరాబాద్, నవంబర్ 27: అమెరికన్ సొసైటీ ఫర్ మెటల్స్ (ఏఎస్‌ఎం)తో కలిసి ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా రెండు కోర్సులను ప్రారంభించింది. ఏఎస్‌ఎం హైదరాబాద్ చాప్టర్ (ప్రొపెషనల్), మెటీరియల్స్ అడ్వాంటేజ్ (ఎంఏ) హైదరాబాద్ చాప్టర్ (స్టూడెంట్) కోర్సులను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అధ్యక్షత వహించగా ఏఎస్‌ఎం ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ నవీన్ మంజూరన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఐఐటీహెచ్‌కు చెందిన 140 మంది ప్రొఫెసర్లతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెటీరియల్ సైన్స్‌లో సహకారంతో పాటు ఆవిష్కరణలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చొరవ ద్వారా ప్రతిభను వెలికితీయడంతో పాటు ఈ రంగంలో అభివృద్ధి, పరిశోధనలకు ఊతమిస్తుందని నిర్వాహాకులు వెల్లడించారు.