ఒకే టైటిల్‌తో ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించారు ఇద్దరు తమిళ కథానాయకులు. ఇద్దరికీ ఇవి 25వ చిత్రం కావటం.. గంటల వ్యవధిలోనే రెండు సినిమాలు ప్రకటించటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘అమరన్’ చిత్రంతో నిరుడు మంచి విజయాన్ని అందుకున్నారు హీరో శివ కార్తికేయన్. ఆయన కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.
ఇది గత డిసెంబర్లో పట్టాలెక్కింది. ఇది సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో విభిన్న కథాంశంతో సిద్ధమవుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాకు ‘పరాశక్తి’ అనే పేరు ఖరారు చేసినట్టు ప్రకటించిన చిత్రబృందం ఈ మేరకు టైటిల్ టీజర్‌ను సైతం విడుదల చేసింది. మరో వైపు ఇదే టైటిల్‌తో వస్తున్నాడు విజయ్ ఆంటోనీ.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో అసా ధారణ నటన, అంకితభావాన్ని ప్రదర్శించనున్నారట. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మరింత ఆకట్టుకోవడమే గాక, ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితోపాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రిప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు భాగస్వాములయ్యారు.
సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్ట్, సంగీతం విజయ్ ఆంటోనీ, ఎడిటిం గ్ రేమండ్ డెరిక్ క్రస్టా, యాక్షన్ కొరియోగ్రఫీ రాజశేఖర్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపు కొంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.