calender_icon.png 31 December, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోంబలేతో మరో రెండు చిత్రాలు

09-11-2024 12:00:00 AM

స్టార్ హీరో ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందే మూడు మెగా చిత్రాల కోసం చేతులు కలిపారు. ఈ చరిత్రాత్మక కలయికలో ‘సలార్’ పార్ట్ 2  తర్వాత, అదనంగా మరో రెండు బ్యాక్‌టుబ్యాక్ సినిమాలు రానున్నందన్న వార్త అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది. ఈ కొలాబరేషన్.. ఇప్పటివరకు ప్రభాస్, ప్రొడక్షన్ హౌస్ మధ్య జరిగిన భారీ డీల్‌గా కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయింది. ఇండియన్ సినిమాస్‌లో అత్యంత డిమాండ్ ఉన్న సూపర్ స్టార్లలో ఒకరైన ప్రభాస్, హోంబలే ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సలార్ 2’తోపాటు ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’తో ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను తీసుకువస్తున్నారు. ఈ బ్యానర్‌లో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ నుంచి మూడు బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్ డేట్స్‌ను పొందడం ఒక రేర్ అచీవ్‌మెంట్. విజన్‌తో కూడిన ఈ కొలాబరేషన్ ఉభయుల కాన్ఫిడెన్స్‌కు ప్రతీకగా నిలుస్తోంది. ఈ తాజా కొలాబరేషన్‌పై హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘హోంబలేలో, సరిహద్దులను దాటే పవర్ అఫ్ స్టొరీ టెల్లింగ్‌ను మేము విశ్వసిస్తాం. ప్రభాస్‌తో మా కొలాబరేషన్ రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే, ఎంటర్‌టైన్‌మెంట్ పంచే టైమ్‌లెస్ సినిమాలను రూపొందించే దిశగా ఒక అడుగు’ అన్నారు.