కొనసాగుతున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ఇద్దరు బందీలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. యార్డెన్ బిబాస్ (35), ఫెంచ్ ఇజ్రాయెలీ ఓఫర్ కలెడరోన్ (54) అనే ఇద్దరు బందీలను విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కీత్ సీగెల్ (65) అనే మరో అమెరికన్ కూడా అప్పగించే చాన్స్ ఉంది.
2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో హమా స్ వీరిని బంధించింది. ఇప్పటికే 8 మంది బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇందుకు ప్రతిగా 110 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం షురువైన తొలిరో జు ముగ్గురు మహిళా బందీలను హమాస్..
వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. 42 రోజుల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందిని హమాస్ విడుదల చేయనుంది. ప్రతిగా 1,700 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది.