calender_icon.png 2 February, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకో రెండు రోజులు వానలు

04-09-2024 12:27:32 AM

ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రానికి రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసింది. రాష్ట్రంలో మంగళవారం మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 49 మి.మీ మేర వర్షం కురియగా.. ఆదిలాబాద్‌లో 31 మి.మీ మహబూబ్ నగర్‌లో 15.8 మి.మీ మేర వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపిం ది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, జోగులాంబ గద్వాల జిల్లా ల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా ల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఉదయం తర్వా త వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుందని, వర్షాల తాకిడి తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.