calender_icon.png 19 November, 2024 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

20-07-2024 09:38:23 PM

హైదరాబాద్: చిలికా సరస్సులో సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని, పూరికి 40కిలో మీటర్ర దూరంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. వాయువ్య దిశగా ఒడిశా, చత్తస్‌ఘడ్ మీదుగా కదులుతూ 12 గంటల్లో బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహాబూబాబాద్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలలకు ఎల్లో ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది.

శనివారం నారాయణపేట, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా,వికారబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం కొత్తగూడెం, ములుగు,జయశంకర్,కరీనంగర్ పెద్దపల్లి, జగిత్యాల జిలాల్లో ఒక మోస్తరు వర్షపాతం, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి,హైదరాబాద్,మెదక్, సంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం,మంచిర్యాలలో సాధారణ వర్షపాతం నమోనట్లు వాతావరణశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.