calender_icon.png 19 April, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రుడి వెలుగుల్లో మరో రెండ్రోజులు

11-04-2025 12:00:00 AM

రష్మిక మందన్నా ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే జోరు కొనసాగిస్తూ ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. ముఖ్యంగా ఈ కన్నడ సోయగం చేస్తున్న వాటిల్లో ‘థామా’ ఒకటి. హార్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు ఆదిత్య సర్పోట్‌దర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ప్రస్తుతం ఈ షూటింగ్ షెడ్యూల్‌లో తాను పాల్గొంటున్న విషయాన్ని తెలియజేస్తూ రష్మిక తన ఇన్‌స్టాలో ద్వారా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ‘మరో రెండు రోజులు రాత్రిపూట షూటింగ్ ఉండబోతుంది.. కాబట్టి నేను పెట్టే పోస్టులు, స్టోరీలు కేవలం చంద్రుడి వెలుగులో, కెమెరా లైట్ల మధ్య కానీ, నక్షత్రాల మధ్య నుంచి ఉండవచ్చు.. ఒప్పుకుంటారా..?’ అంటూ చంద్రుడి వెన్నెల్లో తీసిన స్టిల్‌ను షేర్ చేసింది రష్మిక మందన్నా.

ఇప్పుడు ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆకాశ హర్మ్యాల మధ్య దివి అందాలను చూసేందుకు వీలుకాని నగరవాసం చేస్తున్నవారికి ఈ స్టిల్ కనువిందు చేస్తోంది కూడా. అయితే లొకేషన్ ఎక్కడనే ది సస్పెన్స్‌లో పెట్టేసింది రష్మిక.  ఇంకా రష్మిక.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘కుబేర’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’లోనూ రష్మిక నటిస్తోంది.