calender_icon.png 1 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

21-07-2024 01:16:35 AM

సీబీఐ కస్టడీలో భరత్‌పూర్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు

న్యూఢిల్లీ, జూలై 20: నీట్ పేపర్ లీకేజీ కేసులో ఎంబీబీఎస్ విద్యార్థులు కుమార్ మంగళం బిష్ణోయ్, దీపేందర్ శర్మను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసుల అరెస్టుల సంఖ్య 21కి చేరింది. వీరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ మెడికల్ కళాశాలలో చదువుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జార్ఖండ్ హజారీబాగ్‌లోని ఎన్టీయేకు చెందిన ట్రంక్ పెట్టె నుంచి ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్ పంకజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతడికి వీరిద్దరు సహకరించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.