ఆసియా స్కాష్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ఆసియా డబుల్స్ స్వాష్ చాంపియన్‌షిప్‌లో అభయ్ సింగ్ భారత్‌కు రెండు పతకాలు ఖాయం చేశాడు. పురుషుల డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ అభయ్ సింగ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మలేషియాలోని జోహోర్ వేదికగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో అభయ్, వెల్వన్ సెంథిల్‌కుమార్ జోడీ 11 11 తొమొతకా ఎండో హయాషి (జపాన్) చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో అభయ్ జోష్నా చిన్నప్ప జంట 11 11 హాంగ్ కాంగ్‌కు చెందిన చెంగ్ చింగ్ లా చుక్ మాథ్యూను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది.