పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో గురువారం రెండు లీగ్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. పుణే వేదికగా జరిగిన తొలి మ్యా చ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 22 యు ముంబాతో డ్రా చేసుకుంది. జైపూర్ తరఫున రెజా మిర్బాగెరి 6 పాయింట్లు సాధించగా.. ముంబా తరఫున రోహిత్ 4 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ కూడా 32 డ్రాగా ముగిసింది. యూపీ తరఫున గగన్ గౌడ (13 పా యింట్లు), భవానీ రాజ్‌పుత్‌లు సూపర్ టెన్ సాధించగా.. ఢిల్లీ తరఫున ఆశూ మాలిక్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్, హర్యానాతో పట్నా తలపడనున్నాయి.