21-03-2025 12:37:50 AM
12 తులాల బంగారం, 6.5 తులాల వెండి రికవరీ.
మీడియాతో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
అచ్చంపేట మర్చి 20 : ముస్లిం మహిళలు ధరించే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి ముసుగుతో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలను అచ్చంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుండి 12 తులాల బంగారం 6.5 చుల్లాల వెండి రికవరీ చేశారు. పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియాతో వెల్లడించారు.
అచ్చంపేట పట్టణం వెంకటేశ్వర కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న మల్ రెడ్డి రామకృష్ణ ఇంట్లో గత నెల 16 న ఇద్దరు మహిళలు ముసుగు దేశంలో వచ్చి ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలను దోచుకుని తన భార్య ధరణిపై దాడి చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సవాల్ గా తీసుకొని విచారణ ప్రారంభించగా కొల్లాపూర్ నియోజకవర్గ నెల్లూరు గ్రామానికి చెందిన పోతేపల్లి అశ్విని అచ్చంపేట పట్టణంలోని అదే కాలనీలో నివాసం ఉంటూ టైలర్ గా పనిచేస్తుంది.
తనతో పాటు ఎల్లూరు గ్రామానికి చెందిన చాపల శ్రావ్య అలియాస్ మాండ్ల స్వాతి హైదరాబాద్లో నివాసము ఉంటుంది. కాక బాధితురాలి ఇంట్లో చనువుగా ఉంటూ బంగారు ఆభరణాలపై నిగ ఉంచి కొద్ది రోజుల క్రితమే ఆన్లైన్ ద్వారా బుర్కాలను ఆర్డర్ చేశారు అనంతరం గత నెల 16న ఇంట్లో బాయిత్రాలు ఉన్నారని గమనించి తాగునీరు ఇవ్వాలని మాట కలిపి దాడి చేసి బంగారం నగలు దోచుకెళ్లారు.
అనంతరం పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో అమ్మకానికి బేరం పెడుతుండగా పోలీసులు శాఖ చక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి నుండి బంగారు పుస్తెలతాడు, నల్లపూసల దండ, ఉంగరాలు, వెండి పట్టిలు మొత్తం 140 గ్రాముల బంగారు వస్తువులు, 45 గ్రాముల వెండి, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సవాల్గా తీసుకొని కేసును సేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.