calender_icon.png 20 March, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, జవాన్ మృతి

20-03-2025 12:01:07 PM

బీజాపూర్: సరిహద్దుల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) యూనిట్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందారని ఒక అధికారి తెలిపారు. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని ఆండ్రి అడవుల్లో ఉదయం 7 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా గంగలూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో (బీజాపూర్‌లో) నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుండి తుపాకీలు, పేలుడు పదార్థాలతో పాటు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందాడని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.