calender_icon.png 16 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిలాం-బుర్గమ్ అడవుల్లో ఎన్‌కౌంటర్

16-04-2025 12:51:01 PM

ఇద్దరు మావోయిస్టుల మృతి 

తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన డి వి సి ఎం హల్దార్ , ఏ సీఎం  రామేలు మృతి.  

చర్ల,(విజయక్రాంతి):  చర్ల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ లోని   కొండగావ్- నారాయణపూర్ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కిలాం-బుర్గమ్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు మృతి చెందారు.  కిలామ్-బోర్గం అడవులలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న  సమాచారం ఆధారంగా కొండగావ్ డిఆర్జి /బస్తర్ ఫైటర్స్ బృందం మావోయిస్టు  ఆపరేషన్ ప్రారంభించింది.

ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఎన్‌కౌంటర్‌లో, తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన  మావోయిస్టు కమాండర్  డివిసీఎం హల్దార్ , ఏసీఎం  రామేలను గా గుర్తించారు. వీరిపై రూ 8 లక్షల రివార్డు,  రూ. 5 లక్షల రివర్డులు మొత్తం 13 లక్షల రివార్డు ఉంది, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఒక ఏకే-47 రైఫిల్ , ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు మావోయిస్టు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పరిశోధన ఆపరేషన్ కొనసాగుతోంది.