calender_icon.png 26 April, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు లారీలను అందుబాటులో పెట్టాలి

25-04-2025 12:32:42 AM

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్షించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల, ఏప్రిల్ 22(విజయక్రాంతి): యాసంగి పంట కొనుగోలు లో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని   జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతఃగా జరగాలని అన్నారు.  జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నందున ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డి.ఎం.పౌర సరఫరాల శాఖ రజిత, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, ఏ.పి.ఎం, తదితరులు పాల్గొన్నారు.