calender_icon.png 21 March, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు లారీలు సీజ్

14-03-2025 12:00:00 AM

ఖమ్మం, మార్చి 13 ( విజయక్రాంతి ):  కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామం సమీపంలోని హోటల్ వద్ద  రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన   500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, పోలీసులు  సివిల్ సప్లై అధికారులు గురువారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను  కొనిజర్ల పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా  పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. 

 విషాదంగా మారిన పెళ్లి ఊరేగింపు 

ఖమ్మం నగరంలో గురువారం జరిగిన పెళ్లి ఊరేగింపులో విషాధం చోటు చేసుకుంది. డీజే పాటలకు నృత్యాలు చేస్తున్న పెళ్లి బృందంపై మందు బాబులు కొందరు దాడి చేశారు. ఈ సందర్బంగా పెళ్లి బృందానికి చెందిన ఆరుగురికి  గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన 11 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.