- మరో డ్రైవర్‌కు గాయాలు
- నాలుగు గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్
- చెల్లాచెదురుగా పడిన బీర్ల కోసం ఎగబడిన జనం
- హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం
యాదాద్రి భువనగిరి, జూలై 31 (విజయక్రాంతి): హైదరాబాద్ విజయవాడ జాతీ య రహదారిపై చౌటుప్పల్ మండలం లక్కా రం స్టేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లోడుతో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ మృతిచెందగా, మరో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయప డ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బీరు కాటన్ల లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఉల్లిగడ్డల లోడుతో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉల్లిగడ్డల లోడుతో ఉన్న లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు.
మరో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, లారీ క్యాబిన్‌లో ఇరుక్కు పోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీయడానికి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. దీంతో కిలోమీట ర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో బీరు కాటన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడగా.. ఇదే అదను గా భావించిన కొందరు వాటి కోసం ఎగబడ్డారు. దొరికినకాడికి పట్టుకెళ్లారు. ప్రమా దంపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.