- ట్రాక్ కెమెరాకు చిక్కిన చిత్రాలు
- భయాందోళనలో ప్రజలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి రేంజ్ పరిధిలోని నిశాని, ఇందాపూర్, కరంజీ వాడ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచరిస్తున్నాయి. కారంజీ వాడ, నిషానీ, ఇందాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 4 గం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాకు పులుల చిత్రాలు చిక్కాయని కెరమెరి రేంజ్ అటవీ అధికారి మజారుద్దీన్ తెలిపారు.
అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు చిరుతల సంచారంతో ఆయా అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజ జంకుతున్నారు. పులులను బోనులో బంధించాలని కోరుతున్నారు.