calender_icon.png 1 March, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధికి రెండు లక్షల విరాళం

01-03-2025 08:56:24 PM

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి అభివృద్ధి కోసం రెండు లక్షల రూపాయలు విరాళమును దేవస్థానం అధికారులకు శనివారం అందజేశారు. కరీంనగర్ జిల్లా, గంగాధర్ మండలం, కొండయ్యపల్లి గ్రామానికి చెందిన రెండ్ల కిషన్ మరియు కల్పన దంపతులు స్వామివారి గోశాల మరియు అన్నదాన కార్యక్రమాల కోసం మొత్తం రూ. 2,00,232/- విరాళంగా అందించారు. వీరంతా రూ. 1,00,116/- ను గోశాల నిమిత్తం అందించగా, మరొక రూ. 1,00,116/- ను భక్తులకు అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. ఈ భారీ విరాళాన్ని ఆలయ అధికారులు స్వీకరించి, వారి సేవా మనోభావాన్ని ప్రశంసించారు.