calender_icon.png 10 January, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు కిలోల గంజాయి పట్టివేత

09-01-2025 11:20:02 PM

ముగ్గురి అరెస్ట్, ఆరుగురిపై కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ధూల్‌పేట్‌లోని రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న రాజేందర్‌సింగ్, బ్రిజ్ విక్కీ, మెతోరి చెన్నయ్య అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధమున్న ఆకాశ్‌సింగ్, దుర్గేశ్‌సింగ్, వీరేశ్‌లపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ సీఐలు మధుబాబు, గోపాల్, ఎస్‌ఐలు లలిత, సైదులు సిబ్బంది పాల్గొన్నారు.