calender_icon.png 23 December, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగు పడి ఇద్దరు మృతి

06-10-2024 07:41:12 PM

హన్మకొండ,(విజయక్రాంతి): ఐనవోలు మండలం వెంకటాపూర్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతు కూలీలు పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు శ్రావణి(17), అనే ఇంటర్ విద్యార్థినితో పాటు, కూకట్ల రాజు(25) అనే యువ రైతుగా గుర్తించారు. వారు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పశువుల కొట్టం కిందకు వెళ్తుండగా పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.