calender_icon.png 29 April, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి

29-04-2025 12:30:40 AM

చేగుంట, ఏప్రిల్ 28 :చేగుంట మండలంలో సోమవారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరు అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందగా, మరొకరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని కన్యారం గ్రామానికి చెందిన వడ్డే హరి( 21)  సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో  ఇంటి నుంచి బయటకు రాళ్లు కొట్టడానికి వెళ్ళాడు.

కానీ ప్రభుత్వ పాఠశాల సమీపములో గల ఐటెన్షన్ టవర్కు  ప్లాస్టిక్ తాడుతో ఉరి పెట్టుకొని వేలాడుతూ చనిపోయి ఉన్న విషయం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చేగుంట ఎస్.ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా చేయగా మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చెరువులో పడి వ్యక్తి మృతి...

చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన బుర్కా హర్షవర్ధన్ (17) సోమవారం వారి కులస్తుల దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్ద చెరువులో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి నీటిలో మునిగిపోయాడు. వెంటనే నీటిలో నుండి బయటకు తీయగా అపస్మారక స్థితిలో ఉండడంతో నార్సింగి  చారి హాస్పిటల్ కి తీసుకువెళ్లగా మార్గమధ్యంలోనే చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.