calender_icon.png 16 April, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొట్టిన డీసీఎం.. తల్లి, కొడుకు స్పాట్ డెడ్

16-04-2025 08:48:34 AM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం(Kalher Mandal) బాచేపల్లి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తల్లి సక్రిబాయి, కుమారుడు సుదర్శన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.