కారులోంచి పొలంలో ఎగిరిపడి మహిళ మృతి
హైదరాబాద్: నల్లొండ జిల్లా తిప్పర్తి శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చి అదుపుతప్పిన కారు బైకును ఢీకొట్టాక చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారులో నుంచి పొలంలో ఎగిరి పడిన మహిళ మృతి చెందింది. బైకు నడుపుతున్న దిలావర్ పూర్ వాసి గంధం శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు. మృతురాలు గుంటూరుకు చెందిన శిరీషగా గుర్తించారు. కారు హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.