26-03-2025 09:35:51 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్(Mahankali Police Station) పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులను బన్సీలాల్ పేట(Bansilalpet)కు చెందిన ప్రణయ్(18), బోయగూడకు చెందిన అక్షిత్(21)గా గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.