calender_icon.png 17 April, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

08-04-2025 03:49:24 PM

మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం లాల్ గడి మలక్పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న సఫారీ కారు డివైడర్ దాటి అవతలి వైపున హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలానికి చెందిన రాజు, మేడ్చల్ జిల్లా మురహరి పల్లి కి చెందిన శ్రవణ్ అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. జీనోము వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.