calender_icon.png 29 March, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

26-03-2025 01:52:53 AM

కోదాడ, మార్చి25: కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్‌బొజ్జగూడెం గ్రామ శివారులో రహదారిపై వాటర్ ట్యాంకర్ ను ఇనోవా కారు ఢీకొన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్కు చెందిన అమ్మిరెడ్డి పద్మ (32), నంద్యాల ఉపేందర్రెడ్డి,  వేపుల సింగారకు చెందిన సోము కృష్ణారెడ్డి(43) , గోపిరెడ్డి బ్రహ్మ రెడ్డి, ఖమ్మంలో ఒక కార్యక్రమానికి వెళ్లి  తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహానం ఖమ్మంకోదాడ జాతీయ రహదారిపై  లారీ వాటర్ ట్యాంకర్ను  వెనుక నుండి ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో సోము  కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మలు మృతి చెందగా నంద్యాల ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి బ్రహ్మరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి.. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.