నాగర్‌కర్నూల్, జనవరి 5 (విజయక్రాంతి): రెడీమిక్స్ టిప్పర్‌ను వెనకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం కోదాడ- జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన గణేశ్(28), తాండ్ర గ్రామానికి చెందిన కేతమళ్ల రామకోటి(35) కారులో చారకొండ నుంచి సొంత గ్రామమైన కొట్రకు తిరిగివెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కారును వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి రెడీమిక్స్ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృతిచెందారు.