calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడీ బాంబుపేలి ఇద్దరు మృతి

05-04-2025 01:10:04 AM

అక్కడికక్కడే ఒకరు, మరొకరికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి   

చర్ల , ఏప్రియల్ 4 (విజయ క్రాంతి) : చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం  ఐ ఈ డి బాంబు పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన జాడ్డా , మార్కుడ్ గ్రామం మధ్య కాలిబాట మార్గంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మరణించినవారు ఇద్దరూ కనగాన్ గ్రామానికి చెందిన రామ్ లాల్ కోరం (25), రాజేష్ హీండి (27) గా గుర్తించారు. రామ్ లాల్ అక్కడికక్కడే మృతిచెందగా, రాజేష్ హిండీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.వారిరువురు పుల్జా పొదలు (వంట చెరుకు ) తీసుకోవడానికి అటవీ ప్రాంతానికి వెళ్లారు. మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి లు చూడకుండా తొక్కడంతో అది పేలింది.

ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడ మరణించాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలై న  అతన్ని గ్రామస్తులను చికిత్స కోసం నారాయణ్పూర్కు తరలించారు. చికిత్స పొందు మరణించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఐఇడి డిటెక్షన్ కోసం ప్రత్యేక ప్రచారంలో నారాయన్పూర్ పోలీసులు 15 ఐఇడిలు స్వాధీనం చేసుకున్నాయి .మావోయిస్టులు భద్రతా దళాలను హతమార్చే  ఉద్దేశ్యంతో ఐఇడిలను ఈ ప్రాంతంలో అమర్చారు. భద్రతా దళాలు సంఘటన తో నారాయన్పూర్ పోలీసు లు ఈ ప్రాంతంలో ఐఇడి డిటెక్షన్ సెర్చ్ ఆపరేషన్ను  నిర్వహిస్తున్నారు. 

పోలీసు సూపరింటెండెంట్ నారాయణ్పూర్ ప్రభుత్ కుమార్ (ఇండెప్స్) ఈ ప్రాంతంలోని గ్రామస్తులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనల దృష్ట్యా- ఈ ప్రాంతంలో ఐఇడి గురించి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేయండి. సాధ్యమైనంతవరకు అటవీ ప్రాంతంలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని , ఐడి సమాచారం అందించడం వలన  సమయానికి తొలగించవచ్చు, తద్వారా భద్రతా దళాలు, గ్రామస్తులు, అభివృద్ధి పనులలో నిమగ్నమైన ఉద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను, వన్యప్రాణులను ప్రాణనష్టం జరగకుండా కాపాడవచ్చు అని తెలిపారు.