01-03-2025 06:20:28 PM
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం కోతుల నడుమ శివారులో హైడ్రాన్ ఢీకొన్న(Hydra Crane Collision) సంఘటనలో ఇరువురు మృతి చెందారు. ఎలుకతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగడ రాజేశ్వరరావు(Thangada Rajeswara Rao) ఆయన కుమారుడు తంగడ వికాస్ రావు సైకిల్ పై దండేపల్లి గ్రామానికి వెళ్ళుచుండగా హైడ్రా క్రేన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన హైడ్రా క్రేన్ డ్రైవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.