calender_icon.png 21 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి

21-04-2025 02:02:42 AM

అర్మూర్, ఎప్రిల్ 20 (విజయక్రాంతి) : అర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఏరియాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు మృతి చెందారు. నిర్మల్ వైపు నుండి అజాగ్రత్తగా అతి వేగంగా లారీ నడుపుతూ ముందుగా వెళుతున్న బైక్ ను ఆదివారం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన బంజా ఓంకార్ (13), ఎండ్రికాయల భానుప్రసాద్ (13) సంఘటన స్థలంలోని ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనలో బైకును నడుపుతున్న బాంజ విశ్వనాథ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాద సంఘటన విషయాన్ని తెలుసుకొని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్త్స్ర మహేష్ లు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాలురను ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురీ గదికి తరలించి, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విశ్వనాథ్ ను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

44 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరగడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి క్లియర్ చేయించారు. ఈ డివైడర్ క్రాసింగ్ వద్ద వరి పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవద్దని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఎస్ హెచ్ ఓ సత్య నారాయణ రైతులకు సూచించారు. ఇకముందు ఏ రైతు కూడా ఈ క్రాసింగ్ వద్ద పంట ఉత్పత్తులను ఆరబెట్ట వద్దని రైతులను కోరారు.