calender_icon.png 27 February, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు-, బైక్ ఢీ ఇద్దరు మృతి

20-02-2025 12:56:52 AM

 నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మద్యం మత్తులో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే తెలకపల్లి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన అతినారపు శేఖర్(31) అతినారపు శ్రీనివాసులు(42) సొంత గ్రామం నుండి తాడూరు మీదుగా హైదరాబాద్ బైక్ పై వెళ్తుండగా  తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి హైదరాబాద్ నుండి సొంత గ్రామానికి కారులో వెళుతూ గుంతకోడూరు వద్ద బైకును ఢీ కొట్టాడు.

దీంతో బైక్ నడుపుతున్న శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.  వెంటనే స్థానికులు 108 సాయంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.