13-02-2025 11:05:09 PM
వనస్థలిపురంలో లారీని ఢీకొట్టిన బైక్..
ఎల్బీనగర్: వనస్థలిపురంలో గురువారం లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన ఏకుమల్ల చరణ్ తండ్రి జంగయ్య(25) హయత్ నగర్ లో ఉంటూ కార్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సోదరుడు పవన్ (24) కూడా కారు మెకానిక్ గా పని చేస్తున్నాడు. గురువారం ఇద్దరు కలిసి బైక్ (TS 09 FK 6631)పై హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వస్తున్నారు. ఆటోనగర్ లోని భారత్ బెంజ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.