calender_icon.png 4 March, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం ఇద్దరి దుర్మరణం

04-03-2025 12:34:11 AM

నకిరేకల్ బైపాస్ వద్ద దుర్ఘటన

నకిరేకల్ :  బైక్‌ను గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందా రు. నకిరేకల్ బైపాస్ వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలివి.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రా మానికి చెందిన నల్లగొండ ప్రభు (25), పులగుజ్జు వైష్ణవి (24) బైక్‌పై చెరువుగట్టు నుంచి సూర్యాపేటకు బయల్దేరారు. నకిరేకల్ బైపాస్ ఫ్లుఓవర్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

వాహనం ఢీకొ ట్టిన వేగానికి బైక్ నుజ్జునుజ్జయి తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రా ణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లచ్చిరెడ్డి ఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ద వాఖానకు తరలించారు. అక్కడి నుంచి పో స్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ద వాఖానకు తీసుకెళ్లారు. మృతుడి తల్లి ఫిర్యా దు మేరకు మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యా బ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.